ప్రాజెక్టులకు కేంద్రం బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-05-18T07:48:45+05:30 IST

రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు రోజుకో సమస్య వచ్చిపడుతోంది. తాజాగా ఆయా ప్రాజెక్టులకు రుణాలిచ్చే విషయంలో కేంద్ర రుణ సంస్థలతో సమస్య ఎదురైంది.

ప్రాజెక్టులకు కేంద్రం బ్రేక్‌!

  • ఏప్రిల్‌ 1 నుంచి ఆగిన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ రుణాల విడుదల
  • ఆర్‌బీఐ అనుమతి తీసుకుంటేనే రుణం అంటూ షరతులు
  • రుణాల్ని ఎఫ్‌ఆర్‌బీఎం కింద లెక్కగడుతున్నామన్న కేంద్రం
  • దానికి కొనసాగింపుగానే రిజర్వ్‌ బ్యాంకు నిర్ణయం
  • రుణ సంస్థల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం
  • రుణాలను తిరిగి చెల్లించే దశలో షరతులేమిటని ఆగ్రహం
  • ప్రాజెక్టులకు రుణ సమీకరణపై మల్లగుల్లాలు


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు రోజుకో సమస్య వచ్చిపడుతోంది. తాజాగా ఆయా ప్రాజెక్టులకు రుణాలిచ్చే విషయంలో కేంద్ర రుణ సంస్థలతో సమస్య ఎదురైంది. ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం కింద లెక్కగడుతున్నామని కేంద్రం తాజాగా ప్రకటించిన నేపథ్యంలో... దానికి కొనసాగింపుగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి తీసుకుంటేనే రుణాలిస్తామని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) మెలిక పెట్టాయి. అంతేకాకుండా మంజూరైన రుణాల విడుదల నూ ఏప్రిల్‌ 1 నుంచి ఆపేశాయి. దీంతో పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ‘ఇదేం పద్ధతి? ప్రాజెక్టుల పనులు 90ు పూర్తయ్యాక, ఇదివరకే అన్ని ఒప్పందాలు చేసుకున్నాక మళ్లీ షరతులు పెట్టడమేంటి?’ అని మండిపడింది. ఈ మేరకు ఆ సంస్థలకు లేఖ రాసింది. కాళేశ్వరం కార్పొరేషన్‌ పీఎ్‌ఫసీ నుంచి రూ.37 వేల కోట్ల దాకా రుణం తీసుకోగా.. ఇప్పటిదాకా రూ.33 వేల కోట్లు విడుదలయ్యాయి. తదుపరి రుణం తీసుకోవాలంటే విధిగా ఆర్‌బీఐ అనుమతి కావాలని పీఎ్‌ఫసీ తేల్చిచెప్పింది. ఇక ఆర్‌ఈసీ నుంచి కూడా కాళేశ్వరం కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ వాటర్‌ ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కా ర్పొరేషన్‌ రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకున్నాయి. ఇందు లో ఇప్పటిదాకా రూ.12 వేల కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే పీఎ్‌ఫసీకి వడ్డీల కింద రూ.2309 కోట్లు చెల్లించగా, ఆర్‌ఈసీకి రూ.1165 కోట్లు అసలుతోపాటు వడ్డీ కింద చెల్లించారు. రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలవుతున్న దశలో రుణాల విడుదలపై మెలిక పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది.

 

కీలక దశలో ప్రాజెక్టులు..

రాష్ట్రంలో కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టుల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. వీటికి తక్షణమే నిధుల అవసరం ఉంది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎలకో్ట్ర కాంపోనెంట్‌ పనులకే పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ నుంచి ప్రభు త్వం రుణాలు తీసుకుంది. ఈ రుణాల్లో 40 శాతాన్ని కేంద్రప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కే ఇస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ నుంచి మోటార్లు, పంపుల కోసం ఆర్డర్‌లు ఇవ్వగా.. కొన్ని వచ్చాయి. మరికొన్ని తయారవుతున్నాయి. రుణాలు ఆగిపోతే పరిస్థితేంటనే దానిపై నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కాళేశ్వ రం రెండో టీఎంసీ పనుల్లో 70ు మేర పూర్తయ్యాయి. ఆర్థిక సంక్షోభంతో ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం నిధులు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ దశలో కేంద్ర విద్యుత్తు సంస్థల నుంచి రుణాలు ఆగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో తోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది.   


అయోమయంలో ప్రాజెక్టులు..

నిధుల్లేక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాలతో ఇవి పూర్తిగా ఆగిపోయాయి. దీని అంచనా వ్యయం కూడా ఏకంగా రూ.52,056 కోట్లకు చేరింది. రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా రూ.16,856 కోట్లు పెరిగి.. రూ.52 వేల కోట్లు దాటింది. ఈ ప్రాజెక్టులో ఎలక్ట్రో  కాంపోనెంట్‌ పనులకు రూ.6160 కోట్లను పీఎ్‌ఫసీ మంజూరు చేసింది. ఇందులో రూ.3365 కోట్లు విడుదల కావాల్సిన పరిస్థితుల్లో కేంద్రం నుంచి అనుమతి లేని ప్రాజెక్టులపై గెజిట్‌ రావడంతో నిధుల విడు దలను ఆపేసింది. దీని రుణ ం తిరిగి చెల్లింపు ప్రక్రియ కూడా 2024 అక్టోబరు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా అనుమతులు తెచ్చుకోవడం, ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి ఇబ్బందులు తప్పేలాలేవు.

Updated Date - 2022-05-18T07:48:45+05:30 IST