జూన్‌ 12న ‘మేట్టూరు’ జలాల విడుదల

ABN , First Publish Date - 2021-05-12T18:02:28+05:30 IST

డెల్టా జిల్లాల్లో సాగుపనుల నిమిత్తం వచ్చే జూన్‌ 12వ తేదీ నుంచి మేట్టూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేయవచ్చని వ్యవసాయ నిపుణుల కమిటీ

జూన్‌ 12న ‘మేట్టూరు’ జలాల విడుదల

ప్రభుత్వానికి సిఫార్సు చేసిన నిపుణుల కమిటీ

చెన్నై/ప్యారీస్‌: డెల్టా జిల్లాల్లో సాగుపనుల నిమిత్తం వచ్చే జూన్‌ 12వ తేదీ నుంచి మేట్టూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేయవచ్చని వ్యవసాయ నిపుణుల కమిటీ రాష్ట్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విషయమై నిపుణుల కమిటీ ప్రతినిధి కలైవానన్‌ మాట్లాడుతూ, సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాంలో ప్రస్తుతం 62 టీఎంసీల నీటినిల్వలున్నాయని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెల్టా సాగు కోసం 167.25 టీఎంసీల నీటిని కర్ణాటక రాష్ట్రం నుంచి పొందాల్సి వుందని, డ్యాంలో నిల్వ ఉన్న నీరు, కావేరి నీటితో సహా మొత్తం 229 టీఎంసీల నీరు డెల్టా రైతులకు అందుతుందని, మేట్టూరు డ్యాం నీటిపై ఆధారపడి రాష్ట్రంలోని 12 జిల్లాలు, కేంద్రపాలిత  ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రంలోని కారైకాల్‌ రైతులు జీవిస్తున్నారని పేర్కొన్నారు. వరి సీజన్‌లో వేసే నాట్లకు ఈ నీరు సరిపోని కారణంగా భూగర్భజలాలు, వాననీటితో రైతులు తమ తమ పొలాల్లో పంటలు పండించుకున్నారని, ఖరీఫ్‌ సీజన్‌లో 1.75 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు అవసరమైన భూగర్భజలాల వసతి అందుబాటులో వుందని, మేట్టూరు డ్యాం నీటి విడుదలకు ముందే డెల్టాలో నాట్లు పనులు ప్రారంభించినందు వల్ల మెట్టూరు నీటి అవసరాలు సుమారు 15 టీఎంసీలకు తగ్గుతాయని, అదేవిధంగా, సంబా సీజన్‌లో 5 లక్షల ఎకరాల్లో జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షపు నీటితో పొలాలు దున్ని, నాట్లు వేసేందుకు సాగునీరు అవసరం లేనందువల్ల, డ్యాంలో 25 టీఎంసీల నీటిని ఆదా చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఈ ఏడాది పంటల సాగు కోసం మేట్టూరు డ్యాం నుంచి వచ్చే జూన్‌ 12వ తేదీ నుంచి విడుదల చేయవచ్చని, ఇందుకు డ్యాం చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరమైనంత భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు ఆయన వివరించారు.

Updated Date - 2021-05-12T18:02:28+05:30 IST