అసెంబ్లీ, మండలి నియోజకవర్గాలకు నిధుల విడుదల
ABN , First Publish Date - 2021-08-25T03:00:06+05:30 IST
రాష్ట్రంలోని అసెంబ్లీ, శాసనమండలి నియోజకవర్గాలకు నిధులను ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలోని అసెంబ్లీ, శాసనమండలి నియోజకవర్గాలకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్ కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి 2.5 కోట్ల చొప్పున 382 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సీడీపీ కింద 800 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఒక్కో నియోజకవర్గానికి 3 కోట్లు రూపాయల నిధులు విడుదల అయ్యేవి. తాజాగా వాటిని ఐదు కోట్లకు తెలంగాణ సర్కార్ పెంచింది.