గణేష్‌ ఉత్సవాలకు నిధుల విడుదల

ABN , First Publish Date - 2022-08-19T06:25:11+05:30 IST

జగిత్యాల బల్దియాలో గణేష్‌ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించారు.

గణేష్‌ ఉత్సవాలకు నిధుల విడుదల
ఎలాంటి గుర్రపు డెక్కలేని ప్రస్తుత చింతకుంట చెరువు

పై..పై పనులకు రూ. 28 లక్షల కేటాయింపు

ఆన్‌లైన్‌లో టెండర్లకు ఆహ్వానం

మొదలైన సిండికేట్‌ కాంట్రాక్టర్ల మంతనాలు

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 18 : జగిత్యాల బల్దియాలో గణేష్‌ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించారు. అయితే ఆ నిధుల ను కొంత మంది స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. శాశ్వత పనులు కాకుండా వినాయక చవితి నిమజ్జనానికి ఒక రోజు ముందు చేసి చేతులు దులుపుకునే పనులకు ఏ కంగా రూ. 28 లక్షల నిధులను కేటాయిస్తూ ఇంజనీరింగ్‌ అధికారులు అంచనాలు తయారు చేయగా సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిల్‌ స భ్యులు ఆమోదించారు. అధికారులు టెండర్‌ పక్రియను ఆన్‌లైన్‌లో ఉం చగా మొదటిరోజు నుంచే సిండికేట్‌ అయ్యేందుకు కాంట్రాక్టర్లు ప్రత్యేక స మావేశం సైతం నిర్వహించుకన్నట్లు సమాచారం. టెండర్‌ దక్కించుకు నేం దుకు పాలకవర్గంలోని ఓ నాయకుడు కొంతమంది కౌన్సిలర్లతో కలిసి ప్ర త్యేక వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేసి ఏయే పనులకు ఎవరు టెండరు వేయాలి, ఎంత శాతానికి టెండరు వేసి పనులు దక్కించుకోవాలనే ప్ర ణాళికలను బల్దియా కార్యాలయంలోనే సిద్ధం చేసుకుంటున్నారనే అరోపణలు వినిపిస్తున్నాయి. 

ఆరు పనులకు రూ. 28 లక్షలు..

వినాయక పండుగను పురస్కరించుకుని పండుగ ప్రారంభ వేడుకల నుంచి నిమజ్జనం వరకు జగిత్యాల పట్టణంలో వివిధ రోడ్లలో ఏర్పడిన గుంతలు మొరంతో పూడ్చూట, నిమజ్జనం నిర్వహించే చింతకుంట చెరు వు వద్ద విద్యుత్‌ లైట్లు, క్రేన్ల ఏర్పాటు, బారికేడ్స్‌, చెరువులో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించుట, నాటు తెప్పెలు, గజ ఈతగాళ్లను సమకూర్చేం దుకు గాను అధికారులు రూ. 28 లక్షల నిధులతో పనులు చేపట్టాలని అంచనాలు రూపొందించారు.

గుర్రపు డెక్కలు లేకున్నా... తెప్పల ఏర్పాటుకు నిధులు..

జిల్లా కేంద్రంలో చింతకుంట చెరువులో ప్రతియేటా వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ప్రతిమలు నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఈ ఏడు విస్తారంగా వర్షాలు కురవడంతో వచ్చిన వరదలతో చెరువులో ఉన్న గుర్రపు డెక్క పూర్తిగా తొలగిపోయింది. అయినప్పటికీ అధికారులు మా త్రం ఎలాంటి పరిశీలన చేయకుండానే చెరువులో ఉన్న గుర్రపు డెక్కల తొలగింపు, తెప్పలు, గజ ఈతగాళ్లను సమకూర్చేందుకు గాను రూ. 5 లక్ష ల నిధులను కేటాయించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

పై..పై పనులకు అధిక నిధుల కేటాయింపు...

వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కేవలం ఒక రోజు ముం దు చేసే పైన పైన పనులకు అధిక నిధులు కేటాయించడంపై పలు వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా వివిధ రోడ్లపై ఏర్పడిన గుంతలను క్వారీ డస్ట్‌, చిప్స్‌, మొరంతో పూడ్చేం దుకు రూ. 5లక్షల నిధులు, టవర్‌ నుంచి మంచినీళ్ల బావి రహదారిలో ఏర్పడిన గుంతలకు సీసీ ప్యాచ్‌లు వేసేందుకు రూ. 5లక్షల నిధులు, జం బిగద్దె నుంచి టవర్‌ సర్కిల్‌, టవర్‌ సర్కిల్‌ నుంచి గంజ్‌ చౌరస్తా, టవర్‌ సర్కిల్‌ నుంచికొత్త బస్టాండ్‌ వరకు ఏర్పడిన గుంతలకు సీసీ ప్యాచ్‌లు వేసేందుకు రూ. 5 లక్షల నిధులను కేటాయించారు. ఈ పనులన్నీ కేవ లం వినాయక చవితి నిమజ్జనానికి ఒక రోజు ముందు చేసే పనులు మా త్రమేనని, శాత్వత నిధులతో ఈ పనులు చేపడితే బల్దియా అదాయానికి గండిపడే అవకాశం ఉండదని పలువురు కౌన్సిలర్లే పేర్కొంటున్నారు.

వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా టెండర్లు దక్కించుకునేందుకు యత్నం..

గణేష్‌ వేడుకల పనులకు టెండర్‌ దక్కించుకునేందుకు పాలకవర్గంలో  ప్రధాన పాత్ర షోషించే ఓ నాయకుడు కొంతమంది కౌన్సిలర్లతో కలిసి ప్ర త్యేక వాట్సాప్‌ గ్రూపును తయారు చేసుకుని పావులు కదుపుతున్నట్లు తె లుస్తోంది. కాంట్రాక్టర్లతో రింగ్‌ అయి అన్ని పనులకు కొద్దిపాటి తేడాతో లెస్‌ టెండర్‌ వేసి పనులు దక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందిం చినట్లు బల్దియా కార్యాలయంలో కొంత మంది కౌన్సిలర్లు చర్చించుకో వడం చర్చనీయంశంగా మారింది. వాట్సాప్‌ గ్రూపు తయారు చేసుకుని టెండర్లు దక్కించుకునేందుకు యత్నిస్తున్న వారికి బల్దియా అధికారుల అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బల్దియా ఆదాయాన్ని కా పాడేలా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చర్యలు తీసుకుని వినాయక చ వితి నిమజ్జనం సందర్భంగా నిర్వహించే వివిధ పనులకు అవసరమయ్యే నిధులుపై మరోసారి ప్రాథమిక అంచనాలు వేయాలని, పాలక వర్గం ఆమోదం తెలిపిన పనులనై పునఃపరిశీలన చేయాలని కొంత మంది కౌ న్సిలర్లు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతున్నారు.

వాస్తవాలను ఉన్నతాధికారులు తెలుసుకోవాలి

నక్క జీవన్‌ కుమార్‌, 12వ, వార్డు కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌, 

వినాయక పండుగ నిమజ్జన ఏర్పాట్లకు ఎన్ని నిధులు అవసరముంటాయో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనాలు తయారు చేయాలి. చింతకుంట చెరువులో పూర్తి స్థాయిలో గుర్రపు డెక్క లేకుండానే అంచనాలు తయారు చేసి నిధులు కేటాయించారు. కాంట్రా క్టర్ల రింగ్‌ను నిలుపుదల చేయాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్ర త్యేక శ్రద్ధ వహించి బల్దియా ఆదాయానికి గండి పడకుంగా చూడాలి.

శాశ్వత పనులు చేపట్టాలి

అనుమల్ల కృష్ణహరి, 20వ, వార్డు బీజేపీ కౌన్సిలర్‌, 

ఏడాదిలో వినాయక చవితి వేడుకల క్యాలెండర్‌ ముందుగానే తెలి సినప్పటికీ అధికారులు మాత్రం తాత్కాలిక పనులను మాత్రమే చేపట్టేలా చర్యలు చేపడుతున్నారు. శాశ్వత పనులు చేపట్టి రహదారులను బాగు చేయాలి. రోడ్లపై పడిన ప్యాచ్‌ వర్కులు చేసేందుకు అధిక నిధులు కేటా యించడం కాంట్రాక్టర్లకు వరంగా మారింది. వేడుకలకు ఒక రోజు మాత్ర మే పనులు చేస్తూ పనులు దక్కొంచుకున్న కాంట్రాక్టర్లు జేబులు నింపు కుంటున్నారు. ఆన్‌లైన్‌ టెండర్లు రద్దు చేసి బహిరంగ టెండర్లు నిర్వహించాలి.


Updated Date - 2022-08-19T06:25:11+05:30 IST