కొత్తగా 2686 పింఛన్లకు నిధుల విడుదల

ABN , First Publish Date - 2020-10-31T10:09:41+05:30 IST

జిల్లాలో నవంబరు నెలకు సంబంధించి 5,25,182 పెన్షన్లకుగాను ప్రభుత్వం రూ.126.54 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం 5,22,496 పెన్షన్లుండగా,

కొత్తగా 2686 పింఛన్లకు నిధుల విడుదల

చిత్తూరు అర్బన్‌, అక్టోబరు 30: జిల్లాలో నవంబరు నెలకు సంబంధించి 5,25,182 పెన్షన్లకుగాను ప్రభుత్వం రూ.126.54 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం 5,22,496 పెన్షన్లుండగా, కొత్తగా 2686 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. నవంబరు నెలకు మంజూరైన పింఛన్లలో వృద్ధాప్య - 2,34,291, చేనేత కార్మికులు - 9283, వితంతు- 1,81,734, అభయహస్తం కింద - 14,312, వికలాంగులు - 53,937, కల్లుగీత కార్మికులు - 840, హిజ్రాలు - 111, మత్స్యకారులు - 632, ఒంటరి మహిళలు - 12,284, కిడ్నీ వ్యాధిగ్రస్తులు - 1248, డప్పు కళాకారులు - 6834, చర్మకారులు - 1087, హెచ్‌ఐవీ బాధితులు - 1842, డీఎంఅండ్‌హెచ్‌వో పరిధి - 6432, చిత్రకారులు - 166, సైనిక్‌ పెన్షన్లు 149 ఉన్నాయి. పింఛను సొమ్మును గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాకు ఇప్పటికే సెర్ఫ్‌ అధికారులు జమ చేశారు. ఆ మేరకు వీరు శనివారం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకుని వలంటీర్లకు అందజేయాల్సి ఉంది. అయితే ఆదివారం మధ్యాహ్నానికి వంద శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని డీఆర్‌డీఎ పీడీ తులసి ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-10-31T10:09:41+05:30 IST