ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2022-08-06T09:11:51+05:30 IST

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ (టాస్‌)లో చదివే అభ్యర్థులకు సంబంధించిన పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రకటించారు.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ (టాస్‌)లో చదివే అభ్యర్థులకు సంబంధించిన పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఓపెన్‌ స్కూల్‌లో టెన్త్‌, ఇంటర్‌ చదివేవారు సెప్టెంబరు, అక్టోబరులో రాసే పరీక్షల కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.25 ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో సెప్టెంబరు 1వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది.

Updated Date - 2022-08-06T09:11:51+05:30 IST