డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-07-02T21:31:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)’ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)’ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల అనుబంధ కళాశాలలతోపాటు నూతనంగా ఏర్పాటైన మహిళా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్స్‌ ఇస్తారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించే పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లు పూర్తిచేసినవారు, కంపార్ట్‌మెంటల్‌ ద్వారా పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటిసారి ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు 10 శాతం కోటా అమలుకానుంది. 


దరఖాస్తు విధానం

  • ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేసి ఉన్న మొబైల్‌ ద్వారా దోస్త్‌ వెబ్‌సైట్‌లో నేరుగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలలో బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ పూర్తిచేసి దోస్త్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఫొటో అథెంటికేషన్‌తో టీ యాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా రిజిస్టర్‌ కావచ్చు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తరవాత దోస్త్‌ ఐడీ, పిన్‌ వస్తాయి. వీటిని జాగ్రత్త చేసుకోవాలి. 
  • దోస్త్‌ ఐడీ, పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అయితే దరఖాస్తు ఫారం ఓపెన్‌ అవుతుంది. దీనిని నింపిన తరవాత విద్యార్థి ప్రయారిటీ ప్రకారం కోర్సు, కాలేజీ వివరాలను వెబ్‌ ఆప్షన్స్‌ కింద ఇవ్వాలి. విద్యార్థి మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం సీట్‌ అలాట్‌ అవుతుంది.
  • అభ్యర్థులు తమకు సంబంధించిన స్పెషల్‌ కేటగిరీ సర్టిఫికెట్లను(ఎన్‌సీసీ/సీఏపీ/పీహెచ్‌/ ఇతర కరిక్యులర్‌ యాక్టివిటీస్‌) దగ్గరలోని హెల్ప్‌ లైన్‌ సెంటర్‌లో వెరిఫై చేయించుకోవాలి. 

ముఖ్య సమాచారం

ఫేజ్‌ - 1:

దరఖాస్తు ఫీజు: రూ.200 

రిజిస్ట్రేషన్‌: జూలై 1 నుంచి 30 వరకు

వెబ్‌ ఆప్షన్స్‌: జూలై 6 నుంచి 30 వరకు

స్పెషల్‌ కేటగిరీ సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌: జూలై 28, 29

సీట్‌ అలాట్‌మెంట్‌: ఆగస్టు 6

ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: ఆగస్టు 7 నుంచి 18 వరకు


ఫేజ్‌ - 2

దరఖాస్తు ఫీజు: రూ.400 

రిజిస్ట్రేషన్‌: ఆగస్టు 7 నుంచి 21 వరకు

వెబ్‌ ఆప్షన్స్‌: ఆగస్టు 7 నుంచి 22 వరకు

స్పెషల్‌ కేటగిరీ సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌: ఆగస్టు 18

సీట్‌ అలాట్‌మెంట్‌: ఆగస్టు 27

ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 10 వరకు


ఫేజ్‌ - 3

దరఖాస్తు ఫీజు: రూ.400

రిజిస్ట్రేషన్‌: ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు

వెబ్‌ ఆప్షన్స్‌: ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు

స్పెషల్‌ కేటగిరీ సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌: సెప్టెంబరు 9

సీట్‌ అలాట్‌మెంట్‌: సెప్టెంబరు 16

ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: సెప్టెంబరు 16 నుంచి 22 వరకు


అదనపు సమాచారం

కళాశాలల్లో అభ్యర్థుల రిపోర్టింగ్‌: సెప్టెంబరు 16 నుంచి 22 వరకు 

స్టూడెంట్స్‌ ఓరియంటేషన్‌: సెప్టెంబరు 23 నుంచి 30 వరకు

మొదటి సెమిస్టర్‌ ప్రారంభం: అక్టోబరు 1 నుంచి

వెబ్‌సైట్‌: https://dost.cgg.gov.in

Updated Date - 2022-07-02T21:31:13+05:30 IST