Abn logo
Oct 21 2021 @ 01:40AM

ఏపీ పీజీఈసెట్‌ ఫలితాల విడుదల

ఫలితాలు విడుదల చేస్తున్న వీసీ రాజారెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 20: ఏపీపీజీఈసెట్‌ ఫలితాలను బుధవారం ఎస్వీయూ వీసీ రాజారెడ్డి విడుదల చేశారు. ఎనిమిది వేల మంది పరీక్ష రాయగా, 7300 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన వారు.. ‘ఎస్‌సీహెచ్‌ఈ-ఏపీ’ వెబ్‌ సైట్‌ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ సత్యనారాయణ తెలిపారు.