Advertisement
Advertisement
Abn logo
Advertisement

గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి 4,500 క్యూసెక్కుల నీటి విడుదల

భైంసా, అక్టోబరు 17: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. ఈ కారణంగా ఆదివారం ఉద యం గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు నిర్వాహణ అధికారులు ఒక వరద గేటును ఎత్తి సుద్ధవాగులోకి 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.7 మీటర్లుండగా శనివారం ప్రాజెక్టు నీటి మట్టం 358.5 మీటర్లుగా ఉంది. శనివారం రాత్రి వేళ నుంచి కురిసిన వర్షాల మూలంగా ప్రాజెక్టులోకి 4వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ప్రాజెక్టు నీటి మట్టం 358.7 మీటర్లకు చేరుకోవడంతో నిర్వాహణ అధికారు లు ఒక వరద గేటును ఎత్తి 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో తగ్గేంత వరకు వరద గేటు ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తా మని ప్రాజెక్టు నిర్వాహణఅధికారులు తెలిపారు.

Advertisement
Advertisement