బీసీసీఐ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయండి

ABN , First Publish Date - 2020-07-10T07:33:59+05:30 IST

బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లోని తమ నామినీని విడుదల చే యాలని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సుప్రీంకోర్టును కోరింది. బోర్డు, రాష్ట్ర సంఘాల్లో ఆర్థిక పారదర్శకత కోసం లోథా కమిటీ సిఫారసుల

బీసీసీఐ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయండి

న్యూఢిల్లీ: బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లోని తమ నామినీని విడుదల చే యాలని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సుప్రీంకోర్టును కోరింది. బోర్డు, రాష్ట్ర సంఘాల్లో ఆర్థిక పారదర్శకత కోసం లోథా కమిటీ సిఫారసుల మేరకు అపెక్స్‌ కమిటీలో కాగ్‌ సభ్యుడిని కోర్టు నియమించింది. అయితే, తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడంలో స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నామని కాగ్‌.. ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. అపెక్స్‌ కౌన్సిల్‌లోని 9 మంది సభ్యుల్లో.. ఐదుగురు బీసీసీఐ ఆఫీసు బేరర్లు, క్రికెటర్ల సంఘం నుంచి ఇద్దరు, బీసీసీఐ జనరల్‌ బాడీ (రాష్ట్రాలు) నుంచి ఒకరు, కాగ్‌ నామినీ ఉంటారు.

Updated Date - 2020-07-10T07:33:59+05:30 IST