32వ రోజుకు రిలేదీక్షలు

ABN , First Publish Date - 2022-07-04T05:02:19+05:30 IST

చీపునుంతలలో అక్రమంగా నిర్మిస్తున్న మైనింగ్‌ పనులను

32వ రోజుకు రిలేదీక్షలు
దీక్షలో కూర్చున్న బాధిత రైతులు

తలకొండపల్లి, జూలై 3:  చీపునుంతలలో అక్రమంగా నిర్మిస్తున్న మైనింగ్‌ పనులను నిలిపి వేసి పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బాధిత రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 32వ రోజుకు చేరాయి. దీక్షాశిబిరాన్ని పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు సందర్శించి బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు. మైనింగ్‌ పేరుతో పేదల భూములు లాక్కోవడం తగదని, మైనింగ్‌ను నిలిపివేసి గతంలో ఆ భూములను సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని నాయకులు కోరారు. మైనింగ్‌ను రద్దు చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని బాధిత రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పవన్‌ వాల్మీకి, బాధిత రైతులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-04T05:02:19+05:30 IST