Advertisement
Advertisement
Abn logo
Advertisement

6 నుంచి రిలే దీక్షలు: యూటీఎఫ్‌

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 29: డీఎస్సీల వారీగా టీచర్ల మార్కులు, ర్యాంకుల ఆధారంగా సీనియారిటీ జాబితా ప్రకటించకుంటే డిసెంబరు ఆరో తేదీనుంచి డీఈవో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు యూటీఎఫ్‌ పేర్కొంది. ఈ మేరకు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, రమణ ఆధ్వర్యంలో సోమవారం డీఈవో పురుషోత్తంకు వినతి పత్రంతోపాటు నోటీసు సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి  రఘుపతిరెడ్డి, దక్షిణామూర్తి, పార్థసారథి, శేఖర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement