వెన్నునొప్పి నుంచి ఉపశమనం కోసం...

ABN , First Publish Date - 2020-12-09T19:19:30+05:30 IST

ప్లాంక్స్‌.... సులవుగా చేయగలిగే వ్యాయామం. దీంతో శరీరం దృఢంగా మారుతుంది. ప్లాంక్స్‌ చేయడం మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ రోజూ సాధన చేయడం వల్ల లాభాలు చాలానే. అవేమిటంటే...

వెన్నునొప్పి నుంచి ఉపశమనం కోసం...

ఆంధ్రజ్యోతి(09-12-2020)

ప్లాంక్స్‌.... సులవుగా చేయగలిగే వ్యాయామం. దీంతో శరీరం దృఢంగా మారుతుంది. ప్లాంక్స్‌ చేయడం మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ రోజూ సాధన చేయడం వల్ల లాభాలు చాలానే. అవేమిటంటే...

భుజాలు, చేతులు బలంగా తయారవుతాయి. చక్కని ఆకృతిని పొందుతాయి. 

ఎముకలు, కీళ్లు, కండరాల స్థానంలో మార్పు రాదు.

ప్లాంక్‌ చేస్తే వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

రోజూ ప్లాంక్స్‌ చేస్తే అదనపు క్యాలరీలు ఖర్చవుతాయి. జీవక్రియ రేటు పెరుగుతుంది.

కండరాల అలసట, ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. 

Updated Date - 2020-12-09T19:19:30+05:30 IST