Abn logo
Feb 25 2020 @ 15:33PM

నా అనుమతి లేకుండా కమల్ ముద్దుపెట్టారు: నటి రేఖ

విశ్వనటుడు కమల్‌హాసన్ గురించి ఓ ఇంటర్వ్యూలో తమిళ ప్రముఖ నటి రేఖ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలచందర్ రూపొందించిన `పున్నగాయ్ మన్నన్` సినిమాలో రేఖ, కమల్ హాసన్ జంటగా నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. ఆ ముద్దు సన్నివేశం గురించి తనకు ముందుగా చెప్పలేదని, తన అనుమతి లేకుండానే కమల్ తనకు ముద్దు పెట్టేశారని రేఖ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. 


`బాలచందర్ దర్శకత్వంలో `పున్నగాయ్ మన్నన్` సినిమాకు సంబంధించి సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తున్నాం. ఒక్కసారిగా కమల్ నాకు ముద్దు పెట్టేశారు. నాకేం అర్థం కాలేదు. ముద్దు సీన్ ఉందని నాకు బాలచందర్ కానీ, కమల్ కానీ చెప్పలేదు. నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టేయడంతో కోపం వచ్చింది. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ గారి దగ్గరకు వెళ్లి అడిగాను. అందుకు ఆయన.. `ఈ ముద్దు సీన్‌లో తప్పేముంది? అందులో ఎలాంటి అసభ్యతా లేదు. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉందని చూపించడానికే ఆ సీన్ పెట్టాం` అన్నారు. ఆ సీన్ తర్వాత నాకు కొన్ని రోజుల పాటు నిద్ర లేదు. అదో పీడకలలా నన్ను వెంటాడింద`ని రేఖ వెల్లడించారు. 

Advertisement
Advertisement
Advertisement