Abn logo
Sep 20 2021 @ 23:21PM

కంగ్టి పీహెచ్‌సీకి ‘కాయకల్ప’

అడిషనల్‌ కలెక్టర్‌ రాజార్షిషా నుంచి కాయకల్ప అవార్డు అందుకుంటున్న డాక్టర్‌ మనోహర్‌రెడ్డి

కంగ్టి, సెప్టెంబరు 20:  సంగారెడ్డి జిల్లా కంగ్టిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాయకల్ప అవార్డు దక్కింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన పీహెచ్‌సీల్లో మారుమూల ప్రాంతంలో ఉన్న కంగ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోగులకు వైద్యసేవలు అందించడంలో అనుసరించిన నాణ్యతా ప్రమాణాలను గుర్తించి ఉత్తమ పీహెచ్‌సీగా కాయకల్ప అవార్డు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పీహెచ్‌సీ వైద్యాధికారి మనోహర్‌రెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాజార్షిషా, డీఎంఅండ్‌హెచ్‌వో గాయత్రీదేవి, డీసీహెచ్‌ఎ్‌స సంగారెడ్డి నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.