జిల్లాలో పటిష్ట నిఘా వ్యవస్థ : ఎస్పీ

ABN , First Publish Date - 2021-06-20T06:31:15+05:30 IST

జిల్లాలో ప్రజలకు రక్షణ కల్పిస్తునే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా అత్యంత పటిష్టంగా నిఘా వ్యవస్థ పని చేస్తోందని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. కాగా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించి వాటి అనిచివేతకు సహకరించిన పోలీసులకు శనివారం

జిల్లాలో పటిష్ట నిఘా వ్యవస్థ : ఎస్పీ
శనివారం లాక్‌డౌన్‌పై పోలీసులతో మాట్లాడుతున్న ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 19: జిల్లాలో ప్రజలకు రక్షణ కల్పిస్తునే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా అత్యంత పటిష్టంగా నిఘా వ్యవస్థ పని చేస్తోందని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. కాగా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించి వాటి అనిచివేతకు సహకరించిన పోలీసులకు శనివారం క్యాంపు కార్యాలయంలో నగదు ప్రోత్సాహకాలు, సర్వీసు రివార్డులు అందజేశారు.   ఇందులో జిల్లా పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్‌బీలో పని చేస్తున్న ఏఎస్సైసురేందర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ మనోహార్‌, కానిస్టేబుళ్లు నాగరాజు,  దేవిదాస్‌, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ సయ్యద్‌ రహత్‌ లను ఎస్పీ ఆహ్వానించి నగదు ప్రోత్సాహం, రివార్డులు అందించారు. 

లాక్‌డౌన్‌కు సహకరించిన వారందరికీ అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించడంతో పాటు ఆంక్షలు పాటించిన జిల్లా ప్రజలకు ఎస్పీ అభినందనలు తెలిపారు. కరోనా మహామ్మారి ఉధృతిని కట్టడి చేసిన ఘనత జిల్లా ప్రజలదేనని పేర్కొన్నారు. ఆంక్షల సమయంలో సహకరించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ, వైద్య, పారిశుధ్య కార్మికులు ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించిన 385 మందిపై శనివారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద ఈ మేరకు లాక్‌డౌన్‌ బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీసమీక్షించారు. మే 12నుంచి జూన్‌ 19వరకు ఉల్లంఘ నకు పాల్పడిన వారి వివరాలను వెల్లడించారు. ఇందులో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు 3251, 56కార్లు ఉన్నట్లు వెల్లడించారు. మాస్కులు ధరించని 7224 మందిపై కేసులు నమోదు చేయగా, కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలో భాగంగా 1,747 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

నిస్వార్థమైన సేవలను అలవర్చుకోవాలి 

పోలీసు శాఖలో ఎస్సైలుగా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న నూతన ఎస్సైలందరూ శిక్షణ పూర్తి చేసుకుని నిస్వార్థమైన సేవలను అలవర్చుకోవాలని  ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర సూచించారు. శనివారం 19 మంది శిక్షణ ఎస్సైలతో భేటీ అయ్యారు. వారికి పలు విషయాలను వెల్లడించారు. శిక్షణ ఎస్సైలు గత ఆరు నెలలుగా వివిధ పోలీసు స్టేషన్లలో శిక్షణ పొందుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-20T06:31:15+05:30 IST