రీయింబర్స్‌మెంట్ నేరుగా కాలేజీలకు చెల్లించాలి!

ABN , First Publish Date - 2021-04-20T06:09:23+05:30 IST

పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ వందల కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలలో జమ చేయడం ఆహ్వానించదగ్గ...

రీయింబర్స్‌మెంట్ నేరుగా కాలేజీలకు చెల్లించాలి!

పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ వందల కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలలో జమ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం, కాయకష్టం చేసుకుని జీవించే తల్లిదండ్రులకు భవిష్యత్తుకి ఢోకా లేకుండా తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ చర్య తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. అయితే మహిళలు బ్యాంకుకు వెళ్లి నగదు ఉపసంహరణ చేసుకోవడానికి ప్రాంగణంలో రద్దీ, తీరిక లేకపోవడం, ఎండలు, కరోనా ఇబ్బందిగా మారుతున్నాయి. దీనికితోడు సక్రమంగా పనులు లేకపోవడంతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు ఆ సొమ్మును కుటుంబ ఖర్చులకు వాడుకుం టున్నాయి. దాంతో ఫీజులు చెల్లించని విద్యార్థులను కళాశాల నుండి తొలగిస్తున్నారు. గత ప్రభుత్వాలు రీఎంబర్స్‌మెంట్‌ను కళాశాలలకు నేరుగా చెల్లించినందున అవకతవకలకు తావులేకుండా జరిగేది. ఈ ప్రభుత్వం కూడా ఫీజులు నేరుగా కళాశాలలకు చెల్లించినట్లయితే ‘జగనన్న విద్యా దీవెన’ ఉద్దేశం సక్రమంగా నెరవేరగలదు.   

యర్రమోతు ధర్మరాజు, 

ధవళేశ్వరం

Updated Date - 2021-04-20T06:09:23+05:30 IST