పునరావాసం పనులు పూర్‌

ABN , First Publish Date - 2021-07-27T04:21:48+05:30 IST

పునరావాసం పనులు ముందుకు సాగడం లేదు.

పునరావాసం పనులు పూర్‌
పునరావాసం ప్లాట్లలో నిల్వ ఉన్న వర్షపు నీరు

- చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

- ఎక్కడికక్కడ పనులు పెండింగ్‌


కొత్తకోట, జూలై 26 : పునరావాసం పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడికక్కడ పనులు పెండింగ్‌లో ఉండటంతో, నిర్యాసితులకు న్యాయం జ రగడం లేదు. 2006 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప్పుపుపప్పడు అప్పటి సీఎం వైఎస్సార్‌ జలయజ్ఞలో భాగంగా రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకానికి శ్రీ కారం చుట్టారు. పథకంలో భాగంగా శంకర సముద్రం రిజర్వాయర్‌ పనులు ఐదేళ్లలో పూర్తి చేసి, 90 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఆకాక్షించారు. అలాగే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, గ్రామాన్ని ఖాళీ చేయించాలని తలంచారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పెం డింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి, బీడు భూములను సస్యశ్యామం చేయాలని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ, పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు, పనులు చేయాల్సిన కాంట్రాక్ట రు ముఖం చాటేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వనపర్తి జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వ హించి నిధులు మంజూరు చేయించే బాధ్యత తమదని పునరావాసం ప నులు పూర్తి చేయాల్సింది మీరేనని ఆదేశించారు. అయినా, వారి ఆదేశాలు బేఖాతర్‌ చేశారు. 


నాసిరకంగా పనులు

శంకరసముద్రం రిజర్వాయర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కానాయపల్లి గ్రామ శివారులో 110 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుం చి సేకరించింది. అభివృద్ధి పనులు చేయడానికి రూ.15.40 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నుంచి బీటీ, సీసీ, డ్రైనేజీ, విద్యు త్‌, మట్టి పనులు చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. విడివిడిగా సబ్‌ కాంట్రాక్టర్లు పనులు చేస్తే త్వరగా పనులు పూర్తి అవుతాయని అధికారులు ఆశించారు. అయితే, చేసిన పనులకు సక్రమంగా బిల్లు చెల్లించకపోవడంతో పాటు పనులు పూర్తి చేయించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ప నులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మధ్యలోనే చేతులెత్తేశాడు. పనులను కూ డా ఇష్టానుసారంగా చేశారు. డ్రైనేజీ మధ్యలోనే విద్యుత్‌ స్తంభాలను పాతిం చారు. ప్లాట్లు లేవల్‌ చేయకపోవడంతో, వర్షాలకు నీరు నిల్వ ఉంటోంది. లే అవుట్‌ కూడా సక్రమంగా లేదు. సగం సగం తొలగించిన బండరాళ్లు ఉండ టంతో ప్లాట్లు నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి.

Updated Date - 2021-07-27T04:21:48+05:30 IST