RCIలో డిప్లొమాలు

ABN , First Publish Date - 2022-07-02T21:38:53+05:30 IST

న్యూఢిల్లీలోని రీహేబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ) - డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉద్దేశించిన ఆలిండియా ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఐఓఏటీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది

RCIలో డిప్లొమాలు

న్యూఢిల్లీలోని రీహేబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(Rehabilitation Council of India) (ఆర్‌సీఐ) - డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉద్దేశించిన ఆలిండియా ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఐఓఏటీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, డిజెబిలిటీ రీహేబిలిటేషన్‌ విభాగాల్లో ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌సీఐ ఇన్‌స్టిట్యూషన్‌లు/ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. 


స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు

డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఇంటెలెక్చువల్‌ అండ్‌ డెవల్‌పమెంటల్‌ డిజెబిలిటీస్‌/ హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌/ విజువల్‌ ఇంపెయిర్‌మెంట్‌/ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌), డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్‌ రీహేబిలిటేషన్‌) ప్రోగ్రామ్‌ల వ్యవధి రెండేళ్లు. డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(హియరింగ్‌ ఇంపైర్‌మెంట్‌/ ఇంటెలెక్చువల్‌ డిజెబిలిటీ), డిప్లొ మా ఇన్‌ ఒకేషనల్‌ రీహేబిలిటేషన్‌(ఇంటెలెక్చువల్‌ డిజెబిలిటీ) ప్రోగ్రామ్‌ల వ్యవధి ఏడాది.   

అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోవచ్చు.

డిజెబిలిటీ రీహేబిలిటేషన్‌ కోర్సులు

డిప్లొమా ఇన్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇంటర్‌ (ఎంపీసీ/ బైపీసీ)/ తత్సమాన కోర్సు లేదా డిప్లొమా (మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

డిప్లొమా ఇన్‌ రీహేబిలిటేషన్‌ థెరపీ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండున్నరేళ్లు. బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులు అర్హులు. 

డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/ మేథమెటిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ ఎయిడ్‌ రిపేర్‌ అండ్‌ ఇయర్‌ మౌల్డ్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఫిజిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ లేదా(డిప్లొమా/ ఐటీఐ డిప్లొమా) (ఎలకా్ట్రనిక్స్‌/ ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఇంటర్‌/ తత్సమాన కోర్సు స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. 

సైన్‌ లాంగ్వేజ్‌ కోర్సులు

డిప్లొమా ఇన్‌ ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ ఇంట్రప్రిటేషన్‌ కోర్సు వ్యవధి రెండేళ్లు. ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌ / తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌(చెవిటి వారికి మాత్రమే) ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజెబిలిటీ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి.


ఏఐఓఏటీ  వివరాలు

ఈ ఎగ్జామ్‌లో అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఇస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, రీజనింగ్‌, న్యూమరికల్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, డిజెబిలిటీ స్పెసిఫిక్‌ కంపోనెంట్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 20 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. హై స్కూల్‌ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌ మార్కులు లేవు. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించి అడ్మిషన్స్‌ ఇస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 21 

అడ్మిట్‌ కార్డ్‌లు విడుదల: జూలై 25 నుంచి

ఏఐఓఏటీ తేదీలు: జూలై 30, 31

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల: ఆగస్టు 5న

కౌన్సెలింగ్‌: ఆగస్టు 10 నుంచి 20 వరకు

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 24న

తరగతులు ప్రారంభం: ఆగస్టు 29 నుంచి

వెబ్‌సైట్‌: www.rehabcouncil.nic.in

Updated Date - 2022-07-02T21:38:53+05:30 IST