నియంత్రిత వ్యవసాయం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-06-01T09:58:09+05:30 IST

రాష్ట్రంలో చేపట్టే నియంత్రిత వ్యవసాయం దే శానికి ఆదర్శంగా నిలువనుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నియంత్రిత

నియంత్రిత వ్యవసాయం దేశానికే ఆదర్శం

మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 


నకిరేకల్‌ / చండూరు, మే 31 : రాష్ట్రంలో చేపట్టే నియంత్రిత వ్యవసాయం దే శానికి ఆదర్శంగా నిలువనుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నియంత్రిత సాగు విధానంపై నకిరేకల్‌, చండూరులో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పంటల మార్పిడితో పాటు తక్కు వ పెట్టుబడితో  రైతులు లబ్ధి పొందాలని సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణలో సమశీతోష్ణ భూములు ఉన్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి వచ్చే పంటలను సా గు చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ అందిస్తోందన్నారు.


రైతులు వరి సన్న రకాలు, కం ది, పత్తి, వేరుశనగ, పెసర్లు, మినుములు సాగు చేయాలన్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, కలెక్టర్లు పీజే.పాటిల్‌, అనితారామచంద్రన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజర్ల శంభయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రునాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ సుష్మ, ఎంపీపీ, జడ్పీటీసీలు పల్లె కల్యాణి, వెంకటేశం అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T09:58:09+05:30 IST