కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

ABN , First Publish Date - 2021-06-13T05:18:39+05:30 IST

పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఏఐటీయూసీ కార్యదర్శి కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు శనివారం మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి
మంత్రి బొత్సకు వినతిపత్రం అందిస్తున్న ఏఐటీయూసీ ప్రతినిధులు

విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 12: పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఏఐటీయూసీ కార్యదర్శి కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు శనివారం  మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లు దాటిన కార్మికులను విధుల నుంచి తొలగిస్తుండగా,  వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని కోరారు. కార్మికుల జీతాలతో పాటు, రూ.6 వేలు హెల్త్‌ అలెవెన్సులు ఇవ్వాలని,  వారి సంఖ్య పెంచాలని, పీఎఫ్‌ సొమ్ము కార్మికుల ఖాతాలో జమచేయాలని డిమాండ్‌ చేశారు.   సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో సమ్మెలో పాల్గొనున్నట్టు తెలిపారు. 


 

Updated Date - 2021-06-13T05:18:39+05:30 IST