స్టాఫ్‌నర్సులను రెగ్యులర్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-06-15T05:25:38+05:30 IST

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులను రెగ్యులర్‌ చేయాలని ఏర్పేడులో వైద్య సిబ్బంది నిరసన తెలిపారు.

స్టాఫ్‌నర్సులను రెగ్యులర్‌ చేయాలి
ఆందోళన చేస్తున్న వైద్యసిబ్బంది

ఏర్పేడు, జూన్‌ 14: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులను రెగ్యులర్‌ చేయాలని వైద్య సిబ్బంది డిమాండ్‌ చేశారు. సోమవారం ఏర్పేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్టాఫ్‌నర్సు చిట్టెమ్మ మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో మృతిచెందిన వైద్యసిబ్బందికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం తుంగలో తొక్కిందని వాపోయారు. తక్కువ వేతనంతో పని చేయించుకోవడం దారుణమని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి రాఘవరెడ్డి, సిబ్బంది రాజేంద్ర, మల్లీశ్వరి, అరుణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T05:25:38+05:30 IST