కందుకూరులో ఆగిన రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2020-08-04T11:09:49+05:30 IST

రిజిస్ర్టేషన్‌ శాఖ వింత నిర్ణయంతో కం దుకూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కందుకూరులో ఆగిన రిజిస్ర్టేషన్లు

క్రయ విక్రయదారుల ఇక్కట్లు

ప్రభుత్వం, మున్సిపాలిటీ రాబడికి గండి 


కందుకూరు, ఆగస్టు 3 : రిజిస్ర్టేషన్‌ శాఖ వింత నిర్ణయంతో కం దుకూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల విలువైన భూముల రిజిస్ర్టేషన్లు కూడా నిలిచిపోవడంతో క్రయవిక్రయదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోంది.


దేవాదాయ శాఖ భూమి గుర్తింపు కోసమట...

 పట్టణంలో అభివృద్ధి చెందిన, చుట్టుపక్కల భూములన్నీ కలిపి 865/1ఎ, 1ఎ, 2ఎ 1లోని సర్వే నంబర్లలో ఉన్నాయి. ఆ సర్వే నం బర్‌లో మొత్తం 311.4 ఎకరాలు ఉంది. అదే సర్వే నంబరులో జనార్దన స్వామి దేవాలయం, అంకమ్మ దేవాలయం, స్కంధపురి సోమే శ్వ రాలయం, బంగారమ్మ, నాంచారమ్మ, ఈతముక్కలమ్మ తదితర ఆల యాలు నిర్మించారు.  ఈ ఆలయాలు నిర్మించిన స్థలాలతో పాటు ఆ యా ఆలయాల పరిధిలో భక్తుల సౌకర్యార్థం కేటాయించిన  ఖాళీ స్థలాలతో కలిపి 9.7 ఎకరాలు దేవదాయ శాఖ యాజమాన్యం కింద ఉంది. దీంతో ఆ శాఖ అధికారులు సదరు సర్వే నంబరులో తమకున్న 9.7 ఎకరాలు ఎవరికీ రిజిస్ర్టేషన్లు జరగకుండా చూడాలని రిజిస్ర్టేషన్‌ శాఖకు లేఖ రాశారు. ఆ శాఖ కోరిన సర్వే నంబరు 865/1ఎ, 1ఎ, 2ఎ, 1లోని మొత్తం 311.4 ఎకరాల రిజిస్ర్టేషన్లు నిలిపివేయాల్సిందిగా రిజిస్టార్‌ ఆదేశాలిచ్చారు.


పట్టణమంతా రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. దేవదాయ శాఖకు సంబంధించిన 9.7 ఎకరాలను సబ్‌ డివిజన్‌ చేయించుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న ప్పటికీ ఇలా మొత్తం సర్వేనంబరులో క్రయ విక్రయాలు నిలిపి వేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖకు చెందిన 9.7 ఎకరాలను సబ్‌ డివిజన్‌ చేయాల్సిందిగా 1991లో అప్పటి మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసి రెవెన్యూ, దేవదాయ శాఖ అధికా రులకు ఫైల్‌ పెట్టినా నేటి వరకు ఆ తీర్మానం అమలుకు నోచు కోలేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సదురు భూమిని సబ్‌ డివిజన్‌ చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూ పాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-08-04T11:09:49+05:30 IST