సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిసే్ట్రషన

ABN , First Publish Date - 2022-01-19T05:18:18+05:30 IST

సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ర్టేషనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు స్పష్టం చేశారు.

సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిసే్ట్రషన
పందిపాడు సచివాలయంలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

  1. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు  
  2. పందిపాడులో కార్యాలయం ప్రారంభం 

కల్లూరు, జనవరి 18: సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ర్టేషనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన కల్లూరు మండలం పందిపాడు సచివాలయంలో స్థిరాస్తుల రిజిస్ర్టేషన్ల సేవలను మంగళవారం కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కింద మూడు డివిజన్లలోని మూడు గ్రామాల్లో రీసర్వే వంద శాతం పకడ్బందీగా పూర్తి చేశామన్నారు. కర్నూలు డివిజన కల్లూరులోని పందిపాడు గ్రామంలో 1,462 ఎకరాలు, ఆదోని డివిజన ఆలూరు మండలం కాత్రికిలో 1,169 ఎకరాలు, నంద్యాల డివిజన నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో 613 ఎకరాల రీసర్వే పూర్తయిందన్నారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి వివాదాలు లేకుండా భూములను రీసర్వే చేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, నగర మేయర్‌ బీవై రామయ్య, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత బాజ్‌పాయ్‌, ఆర్డీవో పుల్లయ్య, కర్నూలు, ఆదోని ఆర్డీవోలు హరిప్రసాద్‌, రామక్రిష్ణారెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌, సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ ఏడీ హరికృష్ణ, కల్లూరు తహసీల్దార్‌ రమేష్‌బాబు, ఆర్‌ఐలు లక్ష్మీనారాయణ, వెంకటేష్‌, కార్పొరేటర్‌ నారాయణ రెడ్డి, కర్నూలు సింగిల్‌ విండో అధ్యక్షుడు శివశంకర్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రులు,  ఆరు ప్రైౖవేటు హాస్పిటళ్లలో వైద్యం 

కర్నూలు(కలెక్టరేట్‌), జనవరి 18: ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ వైద్యం అందిస్తున్నామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 36 ప్రైవేటు ఆసుపత్రులను ఇదివరకే గుర్తించామని, ప్రస్తుతం కేసుల సంఖ్యను బట్టి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కర్నూలులోని విశ్వభారతి, అమీలియో, మెడికవర్‌, ఓమ్ని, నంద్యాలలోని శాంతిరాం, ఉదయానంద్‌ ఆసుపత్రుల్లో బాధితులకు వైద్యం అందిస్తామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐసీయూ బెడ్స్‌, నాన ఐసీయూ బెడ్స్‌ ఎన్ని అందుబాటులో ఉన్నాయన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. బాధితులకు ఏ హాస్పిటల్‌ దగ్గరలో ఉందో గుర్తించి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వార్డులను పెంచుకుంటూ పోవాలన్నారు. దీర్ఘకాలికవ్యాధులు, కొవిడ్‌ లక్షణాలు కలిగి ఉన్నవారి నుంచి వెంటనే శాంపిల్స్‌ సేకరించాలని ఆదేశించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్లు మనజీర్‌ జిలాని సామూన, రామసుందర్‌ రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్‌వో పుల్లయ్య, డీసీహెచఎస్‌ డా.లింగన్న, నోడల్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T05:18:18+05:30 IST