సర్కారీ ఆస్తులూ నమోదు

ABN , First Publish Date - 2020-10-02T08:15:22+05:30 IST

వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణలో భాగంగా ప్రభుత్వ ఆస్తులనూ నమోదు చేసే కార్యక్రమం మొదలైంది. గుడి,

సర్కారీ ఆస్తులూ నమోదు

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణలో భాగంగా ప్రభుత్వ ఆస్తులనూ నమోదు చేసే కార్యక్రమం మొదలైంది. గుడి, బడి, మసీదు.. ఇలా అన్నింటి వివరాలను ఆన్‌లైన్‌ చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంలో భాగంగా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.


సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నా.. పంచాయతీల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే టేపులు తీసుకెళ్లి ఇళ్లు కొలవడాన్ని గ్రామాల్లో పక్కనపెట్టారు. ఇంటి యజమాని చెప్పిన వివరాలనే తీసుకుంటున్నారు. ప్రతి వారికి ఆస్తిపై హక్కు కల్పించడానికే ఈ ప్రక్రియను చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఆ సమాచారం స్పష్టంగా పౌరులకు వెళ్లలేదని పంచాయతీరాజ్‌శాఖ గుర్తించింది.


ఆస్తి పన్ను పెంచుతారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ప్రజలను చైతన్యపర్చాలని కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. 

Updated Date - 2020-10-02T08:15:22+05:30 IST