ఓటు నమోదు చేసుకోండి: ఈసీ

ABN , First Publish Date - 2020-08-11T09:02:05+05:30 IST

ఫొటో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా ఓటర్ల నమోదు, సవరణలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఒక ప్రకటన

ఓటు నమోదు చేసుకోండి: ఈసీ

ఫొటో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా ఓటర్ల నమోదు, సవరణలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం http://www.nvsp.in దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దరఖాస్తు, పోలింగ్‌స్టేషన్ల రేషనైలేజేషన్‌, తప్పొప్పుల సవరణ అక్టోబరు 31, సవరించిన ఓటర్ల జాబితాతో  కూడిన ముసాయిదాను నవంబరు 16, దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదుల నమోదుకు డిసెంబరు 15, వీటన్నింటిపై అభ్యంతరాల పరిశీలన జనవరి 5నాటికి పూర్తి చేసి జనవరి 15న  ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది.

Updated Date - 2020-08-11T09:02:05+05:30 IST