Abn logo
Aug 12 2020 @ 14:59PM

విజయ్‌ సేతుపతికి జోడీగా..?

మక్కల్‌ సెల్వన్‌ విజయసేతుపతి సరసన హీరోయిన్‌గా నటించేందుకు మలయాళ భామ రెజినా విజయన్‌ ఎంపికైంది. శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌లో విజయ్‌సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ బయోపిక్‌ చిత్రానికి ‘800’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ చిత్రానికి ఎం.ఎస్‌. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు.  థార్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థతో కలిసి టాలీవుడ్‌ నటుడు రాణా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి సరసన నటించనున్న హీరోయిన్‌ ఎవరనే విషయమై కొంతకాలంగా సస్పెన్స్‌ కొనసాగింది. చివరకు మలయాళ సుందరి రెజిషా విజయన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయమై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. రెజిషా ప్రస్తుతం మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కర్ణన్‌’ చిత్రంలో ధనుష్‌ సరసన నటిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement