Apr 21 2021 @ 13:47PM

వారికి సాయం చేద్దాం ముందుకు రండి: రెజీనా కసాండ్ర

అభినయం, అందంతోనే కాదు.. మంచి మనసుతోనూ మీ మనసులను చూరగొంటానంటోంది చెన్నై సొగసరి రెజీనా కసాండ్ర. సినిమా బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త రిలీఫ్‌ దొరకడంతో ఈ మధ్య సముద్రంలో స్నేహితులతో కలిసి సాహసాలు చేసి ఎంజాయ్‌ చేసిన రెజీనా కసాండ్ర.. ఇప్పుడు ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ వారితో కలిసి పారా అథ్లెట్స్‌ కోసం ఫండ్స్‌ కలెక్ట్‌ చేసే కార్యక్రమంలో నేను సైతం అంటూ రెజీనా ముందుకు వచ్చారు. అందులో భాగంగా ఏకంగా చెన్నై నుంచి పుదుచ్చేరి .. 140 కిలోమీటర్ల  మేరకు 8 గంటల పాటు సైక్లింగ్‌లో పాల్గొన్నారు. మే, జూన్‌ నెలల్లో బెల్జియం, పోర్చుగల్‌లో పారా అథ్లెట్స్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ జరగనుంది. ఇందులో మన దేశం తరపున పాల్గొనబోయే క్రీడాకారుల కోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఫండ్‌ రైజింగ్‌ చేస్తుంది. ఈ సంస్థతో కలిసి పారా అథ్లెట్స్‌కు తన వంతు సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిన రెజీనా కసాండ్రను అభిమానులు ఎంతగానో అప్రిషియేట్‌ చేస్తున్నారు.