May 12 2021 @ 18:01PM

కరాటే శిక్షణలో రెజీనా..!

చెన్నై బ్యూటీ, హీరోయిన్‌ రెజీనా కెసాండ్ర ప్రస్తుతం చేస్తున్న కొరియన్ రీమేక్‌ కోసం కరాటే నేర్చుకుంటుందట. వివరాల్లోకి వెళ్తే..తమిళంలో కంటే తెలుగులోనే మంచి సినీ అవకాశాలు లభించాయి. అయితే ఇటీవల రెజీనా నటించిన ‘నెంజమ్‌ మరప్పదిల్లై’, ‘చక్ర’వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అదేవిధంగా తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి కొరియన్‌ మూవీ రీమేక్‌. తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రం కోసం రెజీనా కరాటే శిక్షణ పొందుతోంది. ఇందులో నివేదా థామస్ కూడా మరో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి శాకినీ డాకినీ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.  ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ చిత్రం రెండు భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. గతంలో సమంత హీరోయిన్‌గా వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం కూడా కొరియన్‌ రీమేక్‌ చిత్రమే. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు రెజీనా కూడా ఈ కొరియన్‌ చిత్రం రీమేక్‌పై గంపెడాశలు పెట్టుకుంది. ఈ పాత్ర కోసం రెజీనా బాగా కష్టపడుతోంది.