Apr 12 2021 @ 07:47AM

బాహుబ‌లి నిర్మాత‌ల‌తో రెజీనా..!

తెలుగు సినిమా స‌త్తాను చాటిన భారీ విజువ‌ల్ వండ‌ర్ ‘బాహుబ‌లి’ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సినిమాతో పాటు బుల్లితెర‌పై భారీ సీరియ‌ల్స్‌ను నిర్మిస్తూ వ‌స్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. హార‌ర్ జోన‌ర్‌లో వెబ్ సిరీస్‌ను నిర్మించ‌బోతున్నార‌ని, అందులో హీరోయిన్ రెజీనా క‌సాండ్ర న‌టించ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌కట‌న వెలువ‌డుతుంద‌ని అంటున్నారు.