రెజీనా కసండ్రాను ఏకిపారేస్తున్న నెటిజెన్స్

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పాలనుకున్న రెజీనా కసండ్రాకి.. కొంతకాలంగా చిన్న సినిమాల్లో పెద్ద పాత్రలు, పెద్ద సినిమాల్లో చిన్నపాత్రలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఆమె పలు తెలుగు, తమిళ సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తున్నారు. రెజీనా నటించిన ‘షాకినీ ఢాకినీ, బోర్డర్, ఆచార్య, పార్టీ, కల్లపార్ట్’ లాంటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే సినిమాలతో పాటు ఆమె పలు కంపెనీల బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారం చేసిన ఒక బ్రాండ్ విషయంలో నెటిజెన్స్ నుంచి ట్రోల్స్ తప్పడం లేదు. ఇంతకీ రెజీనా ప్రచారం చేసింది ఏంటో తెలుసా? ఓ ప్రముఖ కంపెనీ విస్కీ బ్రాండ్ ను.  ఇటీవల అమితాబ్, మహేశ్ బాబులాంటి స్టార్స్ .. టోబాకో యాడ్స్ చేసి.. ఆ తర్వాత విమర్శలెదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెజీనా ఏకంగా ఒక మద్యం  బ్రాండ్ ను ప్రమోట్ చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇన్ స్టా గ్రామ్ లో మద్యం గ్లాసును పట్టుకొని.. ఓ ప్రముఖ కంపెనీ విస్కీ బాటిల్స్ తో ఉన్న ఫోటోను షేర్ చేశారు రెజీనా. తొమ్మిదేళ్ళ వయసులో యాంకరింగ్ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు సినిమాలు, యాడ్స్ చేసే స్థాయికి చేరుకున్నాను. నా ప్రయాణం ఎప్పటికీ పదిలం. ఈ మూమెంట్స్ ను దీంతోనే సెలబ్రేట్ చేసుకుంటాను అంటూ ఆ కంపెనీ బ్రాండ్ పేరు చెబుతూ .. దానికి ప్రచారం చేస్తూ పోస్ట్ పెట్టారు రెజీనా. దాంతో ఆమెపై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తూ ఏకిపడేస్తున్నారు. మరి ట్రోలర్స్ పై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.  


Advertisement