Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 26 Jan 2022 12:21:03 IST

మృణాళినీ సారాభాయ్‌గా నటిస్తున్నందుకు గర్వపడుతున్నాను : రెజీనా కసాండ్ర

twitter-iconwatsapp-iconfb-icon
మృణాళినీ సారాభాయ్‌గా నటిస్తున్నందుకు గర్వపడుతున్నాను : రెజీనా కసాండ్ర

దక్షిణాదిన వివిధ భాషల్లో నటించి సత్తా చాటుకుంది రెజీనా కసాండ్ర. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ప్రత్యేక గీతంలో నర్తించి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ లోనూ జెర్నీ స్టార్ట్ చేసింది. ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో లెస్బియన్‌గా నటిస్తోంది. దాంతోపాటు ఓ ప్రతిష్ఠాత్మకమైన వెబ్ సిరీస్ కు కూడా రెజీనా కమిట్అయింది. దాని పేరు ‘రాకెట్ బాయ్స్’. భారతీయ అంతరిక్ష పరిశోధనలో లెజెండ్స్ అయిన విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా జీవిత చరిత్రగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఫిబ్రవరి 4న సోనీలివ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. విక్రమ్ సారాభాయ్ భార్య మృణాళినీ సారాభాయ్ గా రెజీనా నటిస్తూండడం విశేషం. మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ సంయుక్త నిర్మాణంలో.. అభయ్ పన్ను దర్వకత్వంలో వెబ్ సిరీస్ రూపొందుతోంది.


ఇక ఇందులో మృణాళినీ సారాభాయ్ గా నటిస్తున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందంటోంది రెజీనా. ‘ఆమె టీనేజ్ దశనుంచి విక్రమ్ సారాభాయ్ భార్యగా ఎదగడం అందరికీ ఆదర్శం. ఆమె ఓ అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, ఇన్ స్ట్రక్టర్ కూడా. తన కళలతో ఆమె అత్యత్తమంగా జీవించింది. ఇందులో ఆమె సన్నివేశాలు చాలా తక్కువే ఉన్నా.. ఆమె పాత్ర చేయడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే.. ఆమె భర్త విక్రమ్ సారాభాయ్ పాత్రధారితోనూ, ఇతర పాత్రలతోనూ నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని రెజీనా తెలిపారు. జిమ్ షెర్బ్ , ఇష్వక్ సింగ్ విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా పాత్రలు పోషించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...