రేగా ఇలాకాలో టీఆర్‌ఎస్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2022-09-23T04:45:08+05:30 IST

పినపాక నియోజక వర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కాం గ్రెస్‌ పార్టీలో గెలిచిన రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం, మాజీ ఎమ్మెల్యే పాయం వర్గీయులను పక్కకు పెట్టడంతో వర్గపోరు తారస్థాయికి చేరింది.

రేగా ఇలాకాలో టీఆర్‌ఎస్‌కు చుక్కెదురు
రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరుతున్న సర్పంచ్‌

సొంత పంచాయతీ సర్పంచ్‌ కాంగ్రెస్‌ గూటికి

రేవంత్‌రెడ్డి సమక్షంలో 200 మందితో కలిసి చేరిక

కరకగూడెం, సెప్టెంబరు 22: పినపాక నియోజక వర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కాం గ్రెస్‌ పార్టీలో గెలిచిన రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం, మాజీ ఎమ్మెల్యే పాయం వర్గీయులను పక్కకు పెట్టడంతో వర్గపోరు తారస్థాయికి చేరింది. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల బూర్గంపాడు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌, కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు టీఆర్‌ఎస్‌ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేశారు. రేగా కాంతారావు సొంత పంచాయతీ సర్పంచ్‌ శ్రీవాణి, ఉప సర్పంచ్‌ సావిత్రి, ఏడూళ్ల బయ్యారం మాజీ సర్పంచ్‌ చందారావు, ఉప సర్పంచ్‌ వెంకటేశ్వరెడ్డి పలువురు వార్డు మెంబర్లు, సుమారు 200 మందితో హైదాదబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వారిని పక్కన పెట్టడమే కారణమా?

ఇటీవల కరకగూడెం మండలంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు తుళ్లురు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని టీఆర్‌ఎస్‌ నాయకులు పత్రికా ప్రకటన చేశారు. కానీ పొంగులేటి, పాయం అభిమానులు పర్యటనలో పాల్గొనడంతో వారిని అధికారిక పర్యటనలకు, పార్టీ కార్యక్రమాల్లో పక్కన పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి ఉన్న పదవులను కూడా తొలగించి దళితబంధు వంటి పథకాలను ఇవ్వకుండా నిలుపుదల చేశారనే విమర్శలున్నాయి.

Updated Date - 2022-09-23T04:45:08+05:30 IST