ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొన్నాక పెళ్లికి నిరాకరిస్తే ‘అత్యాచారం కాదు’.. రేప్ కేసు వర్తించదు.. Kerala High Court తీర్పు

ABN , First Publish Date - 2022-07-10T00:57:51+05:30 IST

ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొన్నాక ఎవరైనా ఓ వ్యక్తి పెళ్లికి నిరాకరిస్తే అది ‘అత్యాచార నేరం’గా పరిగణించబడదని, రేప్ కేసు వర్తించబోదని కేరళ హైకోర్ట్ స్పష్టం చేసింది.

ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొన్నాక పెళ్లికి నిరాకరిస్తే ‘అత్యాచారం కాదు’.. రేప్ కేసు వర్తించదు.. Kerala High Court తీర్పు

కొచ్చి : ఎవరైనా ఓ వ్యక్తి ఇష్టపూర్వకంగా సెక్స్‌(Sex)లో పాల్గొన్నాక పెళ్లికి నిరాకరిస్తే అది ‘అత్యాచార నేరం’గా పరిగణించబడదని, రేప్ కేసు(rape case) వర్తించబోదని కేరళ హైకోర్ట్(Kerala High Court) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం కీలకమైన తీర్పునిచ్చింది. బలవంతంగా లేదా మోసపూరిత రీతిలో ఒప్పించి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మాత్రమే అత్యాచారం కేసు వర్తిస్తుందని కోర్ట్ తెలిపింది. అత్యాచారం కేసు(FIR ప్రకారం)లో నిందితుడిగా ఉన్న ఓ లాయర్‌కి బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్ట్ ఈ మేరకు శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది.


‘‘ ఇద్దరు మేజర్లు పరస్పర సమ్మతంతో లైంగికంగా కలిస్తే ఐపీసీలోని సెక్షన్ 376 కింద అది అత్యాచారం కాదు. మోసపూరితం లేదా తప్పుదోబపట్టించినప్పుడు మాత్రమే రేప్ కేసు వర్తిస్తుంది. వైవాహిక జీవితంలో దంపతుల మధ్య లైంగిక బంధం ఉచ్చస్థితిలో లేకున్నా అత్యాచారంగా పరిగణించబడదు. సమ్మతిని అతిక్రమిస్తున్నట్టు పేర్కొనే తగు కారణాలు ఉన్నప్పుడు తప్ప రేప్‌ కేసు పెట్టలేము. తదనుగుణంగా శారీరకంగా కలిశాక పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడాన్ని రేప్ కేసు పెట్టడానికి కారణంగా చెప్పజాలం. ఆడ, మగ మధ్య లైంగిక బంధం బలవంతంగా కొనసాగితే మాత్రమే అత్యాచారంగా పరిగణించబడుతుంది.’’ అని జస్టిస్ బెచు కురియాన్ థామస్ బెంచ్ స్పష్టం చేసింది.


కాగా కేరళ హైకోర్ట్‌లో లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తున్న ఓ వ్యక్తి.. తన సహచరిణి, న్యాయవాదిగా ప్రాక్టిస్ చేస్తున్న ఒక మహిళతో నాలుగేళ్లపాటు లైంగిక బంధాన్ని నెరిపాడు. కానీ ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో బాధిత మహిళ ఆత్మహత్యకు యత్నించింది. చాకుతో మణికట్టుని కొసుకుని ఆస్పత్రి పాలైంది. ఎర్నాకులంలోని ఓ హాస్పిటల్ ఐసీయూ నుంచి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా నిందిత లాయర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఆరోపణల మేరకు రేప్ కేసు నమోదు చేశారు. తన క్లయింట్ సంబంధిత మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన అధీనంలో లేని కారణాల వల్ల పెళ్లి చేసుకోవడం సాధ్యపడలేదని నిందితుడి తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కారణంగా శారీరక బంధం పెళ్లిగా మారలేదని వాదించారు.

Updated Date - 2022-07-10T00:57:51+05:30 IST