సహాయ నిరాకరణే!

ABN , First Publish Date - 2021-01-24T07:41:15+05:30 IST

గ్రామ పంచాయ తీ ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎ్‌సఈసీ)కి ప్రభుత్వ యంత్రాంగం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది.

సహాయ నిరాకరణే!

  • ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినా
  • ప్రభుత్వ యంత్రాంగం బేఖాతర్‌
  • ఎస్‌ఈసీ మీడియా సమావేశానికి
  • హాజరుకాని పంచాయతీరాజ్‌ కమిషనర్‌
  • వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్లు డుమ్మా
  • కాన్ఫరెన్స్‌కు రావాలని సీఎస్‌కు లేఖ
  • రాలేనని ఆదిత్యనాథ్‌ దాస్‌ సమాధానం


అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయ తీ ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎ్‌సఈసీ)కి ప్రభుత్వ యంత్రాంగం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. శనివారం ఉదయం తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరుకావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి క మిషనర్‌ను కోరినా ఆయన రాలేదు. మధ్యాహ్నం 3 గంటల కు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించ తలపెట్టామని, దీనికి కలెక్టర్లు, అధికారులు హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సూచించారు. సాయంత్రం 5 గంటల దా కా ఆయన ఎదురుచూశారు. జిల్లాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ హాళ్లు తెరిచినా.. ఒక్క అధికారీ రాలేదు. కొన్ని జిల్లాల్లో పం చాయతీరాజ్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ హాలు వద్దకు వచ్చినా.. కలెక్టర్ల ఆదేశాల కారణంగా పాల్గొనలేదు.


సీఎస్‌ ఆదేశాలతోనే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో నిమ్మగడ్డ సీఎ్‌సకు మరోసారి లేఖ రాస్తూ..ఆయన కూడా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరై కొవిడ్‌పై సూచనలివ్వాలని.. ఎన్నికలపై చర్చిద్దామని కోరారు. అయితే అనివార్య కారణాల వల్ల వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేకపోతున్నామని సీఎస్‌ లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనకు సహకరించడం లేదని ఎస్‌ఈసీ నిర్ణయానికి వచ్చింది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియకు ఆటం కం కలిగిస్తున్న తీరుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2021-01-24T07:41:15+05:30 IST