‘మూడు రాజధానులపై రిఫరెండం నిర్వహించాలి’

ABN , First Publish Date - 2020-08-02T18:00:32+05:30 IST

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై రిఫరెండం నిర్వహించాలని..

‘మూడు రాజధానులపై రిఫరెండం నిర్వహించాలి’

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై రిఫరెండం నిర్వహించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నుంచి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల మ్యానిఫేస్టులోగానీ, ఎన్నికల ప్రచారంలో గానీ రాజధాని మారుస్తామని ఎక్కడా ప్రకటించలేదని పైగా అమరావతిలోనే ఉంచుతామని చెప్పారని, అందుకే ఇప్పుడు మారుస్తున్నందున ప్రజాభిప్రాయం తీసుకోవాలని అంటున్నారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దానికి కారణమేమిటో కొన్ని జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలో స్పష్టంగా తెలుస్తోంది.


ఏపీలో మూడు రాజధానుల బిల్లుపై ఇండియా టీవీ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో అత్యధికంగా చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు మంచి ఆలోచన కాదని స్పందించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది అదే అభిప్రాయం తెలిపారు. అదే సమయంలో 29 శాతం మంది మాత్రమే మంచి నిర్ణయమని సమర్ధించారు. నాలుగు శాతం మంది మాత్రం చెప్పలేమన్నారు. ఇండియా టీవీ నిర్వహించిన పోల్‌లో 8వేల మందికిపైగా తమ అభిప్రాయం వెలుబుచ్చారు.

Updated Date - 2020-08-02T18:00:32+05:30 IST