జీవితాన్ని పునఃపరిశీలించుకోండి

ABN , First Publish Date - 2020-04-03T06:02:15+05:30 IST

కరోనా సంక్షోభం ఇదివరకెన్నడూ ఎరుగనిదని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని పునఃపరిశీలించుకోవాలని...

జీవితాన్ని పునఃపరిశీలించుకోండి

  • ‘కరోనా’ తర్వాత దశకు సిద్ధం కండి
  • సిబ్బందికి ఆనంద్‌ మహీంద్రా లేఖ 

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం ఇదివరకెన్నడూ ఎరుగనిదని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని పునఃపరిశీలించుకోవాలని మహీంద్రా తన గ్రూప్‌ ఉద్యోగులకు సూచించారు. కరోనా తర్వాత దశకు సిద్ధం కావాలంటూ వారికి లేఖ రాశారు. మహీంద్రా గ్రూప్‌లో 2 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకోవాలని.. ప్రస్తుత ఖాళీ సమాయాన్ని సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణల కోసం ఉపయోగించుకోవాలని మహీంద్రా సూచించారు. భవిష్యత్‌ కోసం మరింత ఉన్నతాశయాల్ని నిర్దేశించుకోవాలని.. తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. 

Updated Date - 2020-04-03T06:02:15+05:30 IST