‘రీల్స్‌’ వ్యూస్‌ పెంచుకోవచ్చు

ABN , First Publish Date - 2022-06-18T09:40:33+05:30 IST

టిక్‌ టాక్‌’కు పోటీగా అవతరించిన ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’ అనతికాలంలోనే ఆదరణ పొందిన విషయం తెలిసిందే.

‘రీల్స్‌’ వ్యూస్‌ పెంచుకోవచ్చు

టిక్‌ టాక్‌’కు పోటీగా అవతరించిన ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’ అనతికాలంలోనే ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతకు మునుపే స్టోరీ ఫీచర్‌ ఉంది. పరిమితి పదిహేను సెకండ్లు. అయితే రీల్స్‌ విషయంలో ఫార్మేట్‌ మారింది. దీని పరిమితి 90 సెకన్లకు తోడు అడ్వాన్స్‌డ్‌ ఎడిటింగ్‌ టూల్స్‌ తోడయ్యాయి. రీల్స్‌కు వ్యూస్‌ పెంచుకోవచ్చు. అదెలాగంటే

పాపులర్‌ పాటలు లేదంటే సంగీతాన్ని జోడించడం ద్వారా వీక్షకులను పెంచుకోవచ్చు. ఇటీవల విడుదలైన ఆడియో లేదంటే ట్రెండింగ్‌లో ఉన్నది ఉపయోగించుకోవడం కూడా మంచిదే. 

రొటీన్‌కు భిన్నంగా అంటే క్రియేటివిటీ అవసరమవుతుంది. పాపులర్‌ అయిన టాపిక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. 

సరిగ్గా కుదురుకునే హ్యాష్‌టాగ్స్‌ను ఉపయోగించాలి. టాపిక్‌కు కలిసివచ్చేలా హ్యాష్‌ టాగ్‌ ఉండాలి. జనాల ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌ను వీక్షిస్తే పాపులర్‌గా ఉన్నవి పట్టుకోవచ్చు.

అప్పుడొకటి, ఇప్పుడొకటి అని కాకుండా ఒక షెడ్యూల్‌ ప్రకారం రీల్స్‌ను విడుదల చేయాలి. కంటెంట్‌ క్రియేటర్లు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. రోజూ, రోజువిడిచి రోజు లేదంటే వారానికి ఒకటి అని షెడ్యూల్‌ ఒకటి పెట్టుకుని మరీ విడుదల చేయాలి.

క్యాప్షన్స్‌ ఎప్పుడైనా ఆకట్టుకుంటాయి. అవి చాలా చిన్నవిగా ఉండాలి. అదే సమయంలో క్రియేటివిటీని 

జోడించాలి.  

Updated Date - 2022-06-18T09:40:33+05:30 IST