పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు?

ABN , First Publish Date - 2021-03-02T07:27:21+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది కరోనా నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్ఠస్థాయికి తగ్గినా, ఆ ప్రయోజనం

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు?

న్యూఢిల్లీ, మార్చి1: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని   విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది కరోనా నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్ఠస్థాయికి తగ్గినా, ఆ ప్రయోజనం ప్రజలకు చేరకుండా కేంద్రం రెండుసార్లు భారీగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర ఆర్థిక శాఖ ఈ అంశంపై కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో, ఆయిల్‌ కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ అంశంపై మార్చి రెండో వారం ముగిసే సమయానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు.. త్వరలోనే చమురు ఉత్పత్తి(ఒపెక్‌) దేశాల భేటీ జరగనుంది. చమురు ఉత్పత్తిని పెంచాలని ఆ దేశాలు నిర్ణయిస్తే ముడిచమురు ధరలు తగ్గే అవకాశం ఉందని అప్పుడు పన్నుల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

Updated Date - 2021-03-02T07:27:21+05:30 IST