బీఓఐ వడ్డీరేట్ల తగ్గింపు

ABN , First Publish Date - 2021-10-18T07:34:35+05:30 IST

గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు 0.35 శాతం నుంచి 0.50 శాతం మేరకు తగ్గిస్తున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ప్రకటించింది. ...

బీఓఐ వడ్డీరేట్ల తగ్గింపు

ముంబై: గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు 0.35 శాతం నుంచి 0.50 శాతం మేరకు తగ్గిస్తున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ప్రకటించింది. దీంతో వడ్డీరేటు గృహ రుణాలపై 6.85 శాతం నుంచి 6.50 శాతానికి, వాహన రుణాలపై 7.35 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది. కొత్త రేట్లు సోమవారం నుంచి డిసెంబరు 31 వరకు అమలులో ఉంటాయి. కొత్త రుణాలు తీసుకునే వారికి, రుణం బదిలీ చేయించుకునే వారికి కూడా ఈ రేట్లు వర్తిస్తాయి. డిసెంబరు 31 వరకు ఇంటి, వాహన రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు కూడా రద్దు చేస్తున్నట్టు బ్యాంక్‌ ప్రకటించింది. 

Updated Date - 2021-10-18T07:34:35+05:30 IST