వ్యవసాయ బడ్జెట్‌ తగ్గించి

ABN , First Publish Date - 2020-07-10T10:33:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించి రైతు దినోత్సవాన్ని జరిపితే ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌

వ్యవసాయ బడ్జెట్‌ తగ్గించి

రైతు దినోత్సవం జరిపితే ఏం లాభం

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 


వేంపల్లె, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించి రైతు దినోత్సవాన్ని జరిపితే ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి ప్రశ్నించారు. వేంపల్లెలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.18,328 కోట్లు కేటాయించి కేవలం రూ.6,548 కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు.


కాంగ్రెస్‌ హయాంలో బడ్జెట్‌లో 17శాతం వ్యవసాయానికి కేటాయించగా వైసీపీ ప్రభుత్వం 5.76శాతం మాత్రమే కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద ఇంకా రూ.8వేల కోట్లు వ్యవసాయదారులకు మాఫీ చేయాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.5వేలు కోతపెట్టడం శోచనీయమన్నారు. రైతు ఆత్మహత్యలు నిత్యం జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. ఇప్పటికైనా వట్టిమాటలు కట్టిపెట్టి రైతులకు వీలైనంత బడ్జెట్‌ కేటాయించి ఆదుకోవాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-10T10:33:58+05:30 IST