తగ్గిన యూబీఐ వడ్డీ రేట్లు

ABN , First Publish Date - 2020-07-11T06:42:36+05:30 IST

తగ్గిన యూబీఐ వడ్డీ రేట్లు

తగ్గిన యూబీఐ వడ్డీ రేట్లు

ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఎంసీఎల్‌ఆర్‌ రేటును 0.20 పాయింట్ల మేరకు తగ్గించింది. తక్షణం ఈ రేట్లు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.60 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.10 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.25 శాతానికి తగ్గుతాయి. గత జూలై నుంచి బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది 13వ సారి.


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం తగ్గించింది. ఇది ఆదివారం నుంచి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.60 శాతానికి, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.45 శాతానికి తగ్గుతాయి.

Updated Date - 2020-07-11T06:42:36+05:30 IST