తగ్గిన ధరల సెగ

ABN , First Publish Date - 2022-08-13T05:39:53+05:30 IST

దేశంలో ధరల సెగ తగ్గుముఖం పట్టింది. జూలై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.71 శాతానికి దిగొచ్చింది. అంతకు ముందు నెలతో పోలిస్తే ఇది 0.3 శాతం తక్కువ. గత ఏడాది ఇదే

తగ్గిన ధరల సెగ

జూన్‌లో  ద్రవ్యోల్బణం 6.71 శాతానికి


న్యూఢిల్లీ: దేశంలో ధరల సెగ తగ్గుముఖం పట్టింది. జూలై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.71 శాతానికి దిగొచ్చింది. అంతకు ముందు నెలతో పోలిస్తే ఇది 0.3 శాతం తక్కువ. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా 1.12 శాతం ఎక్కువగా ఉంది. ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న 4-6 శాతం పరంగా చూసినా ఇది ఇంకా 0.71 శాతం ఎక్కువ. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్ణీత లక్ష్యానికి మించి నమోదు కావడం వరుసగా ఇది ఏడో నెల. ఆహార ఉత్పత్తుల ధరలు కొద్దిగా దిగి రావడం జూలై నెల రిటైల్‌ ద్రవ్యోల్బణానికి కలిసొచ్చింది. జూన్‌లో 7.75 శాతంగా ఉన్న ఆహారోత్పత్తుల ధరల శ్రేణి జూలైలో 6.75 శాతానికి దిగొచ్చింది. లేకపోతే జూలైలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడు శాతంపైన నమోదయ్యేదంటున్నారు. 

Updated Date - 2022-08-13T05:39:53+05:30 IST