యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-12-05T07:22:41+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి సన్నిధిలో శనివారం భక్తుల రద్దీ అంతగా కనిపించలేదు. అమావా స్య తిధికావడంతో వారాంతమైన క్షేత్ర సందర్శనకు విచ్చేసే భక్తజనుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

స్వామికి ఘనంగా నిత్యారాధనలు

గోశాలలో సంప్రదాయరీతిలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు

నా పూర్వ జన్మ సుకృతం : దేవస్థాన ఈవో గీతారెడ్డి

బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు


యాదాద్రి టౌన్‌, డిసెంబరు 4: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి సన్నిధిలో శనివారం భక్తుల రద్దీ అంతగా కనిపించలేదు. అమావా స్య తిధికావడంతో వారాంతమైన క్షేత్ర సందర్శనకు విచ్చేసే భక్తజనుల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాదాద్రిక్షేత్రంలో భక్తుల సంచారం,ఆర్జితసేవల నిర్వహణలతో కళకళలాడిన ఆలయ తిరువీధులు.. సేవా మం డపాలు.. దర్శన క్యూలైన్లులో సందడి సద్దుమణిగింది. పట్టణ ప్రధాన రహదారులు.. ఘాట్‌రోడ్‌లు భక్తుల సందడి అంతగాలేకపోవడంతో వెలవెలబోయాయి. స్వామివారి ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.66,900 ఆదా యం మాత్రమే సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. స్వా మికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామి ని మేల్కొలిపిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను కొలిచారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు చేశారు. కల్యాణమండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు, కొండకింద పాత గోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. స్వామికి భక్తులనుంచి వివిధ విభాగాల ద్వారా రూ.10,25,143 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 


గోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు

యాదాద్రిక్షేత్రంలో ప్రతీ యేటా కార్తీకమాసాన్ని పురస్కరించుకొని సత్యనారాయణస్వామి, దామోదర వ్రతపూజలు, వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయం. శనివారం కార్తీక బహుళ అమావాస్య తిథిని పురస్కరించుకొని మల్లాపురం శివారులోని దేవస్థాన గోశాలలో సత్యనారాయణస్వామి, దామోదర వ్రతపూజలు శైవాగమపద్ధతిలో నిర్వహించారు. గోశాల ఆవరణలో ప్రత్యేకవేదికలు ఏర్పాటు చేసిన అర్చకులు, పురోహితులు, వేద పండితులు సంప్రదాయరీతిలో వ్రతపూజల ను చేపట్టారు. వ్రతపూజలనంతరం కార్తీక మాసోత్సవాల్లో భాగంగా వనభోజనాలను ఏర్పాటుచేశారు. కార్తీక వేడుకల్లో ఆలయ అనువంశిఖ ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


నా పూర్వ జన్మ సుకృతం : దేవస్థాన ఈవో గీతారెడ్డి

యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో విధులు చేపట్టడం తన పూర్వ జన్మ సుకృతమని, స్వామివారి కృపాకటాక్షాలతోనే ఇంతకాలం విధులు నిర్వహిస్తున్నానని దేవస్థాన ఈవో యన్‌ గీతారెడ్డి తెలిపారు. యాదాద్రి దేవస్థానంలో ఈవోగా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమెను ఆలయ ఉద్యోగులు శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామి సన్నిధిలో విధుల నిర్వహణతోపాటు ఆలయ అభివృద్ధిలో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  ముందుగా యాదాద్రి దేవస్థాన అర్చక, వేదపండితులు, పురోహితులు ఆమెకు ఆశీర్వచనం చేశారు. యాదాద్రిక్షేత్రంలో కార్తీక సమారాధనలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పథి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్వేల్‌ రమేశ్‌బాబు, సిబ్బంది తదితరులున్నారు.  

Updated Date - 2021-12-05T07:22:41+05:30 IST