వంటగ్యాస్‌ ధర తగ్గించండి

ABN , First Publish Date - 2020-06-03T11:05:58+05:30 IST

వంట గ్యాస్‌ సిలిండర్‌పై పెంచిన ధరను తగ్గించాలని సీపీఎం, అనుబంధ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

వంటగ్యాస్‌ ధర తగ్గించండి

నెల్లూరు(వైద్యం), జూన్‌ 2 : వంట గ్యాస్‌ సిలిండర్‌పై పెంచిన ధరను తగ్గించాలని సీపీఎం, అనుబంధ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ధర పెంపుపై నెల్లూరులోని సుందరయ్య కాలనీ వద్ద మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్‌ రెహనా బేగం, ఐద్వా రూరల్‌ కార్యదర్శి షాహినాబేగం మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పనులు లేక సామాన్యులు అవస్థలు పడుతుంటే ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాల్సింది పోయి సిలిండర్‌  ధర పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో రమాదేవి, రిజ్వాన, జ్యోతి, షరీన్‌, లలిత, యాగవల్లి, సౌందర్యమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నగరంలోని 33వ డివిజన్‌లోనూ నిరసన తెలిపారు. నాయకుడు బత్తల కృష్ణయ్య మాట్లాడుతూ  పెంచిన ధర తగ్గించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖలీల్‌, కాలేషా, షంషాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T11:05:58+05:30 IST