world nature day : ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించండి.. పర్యావరణాన్ని కాపాడండి.

ABN , First Publish Date - 2022-10-03T18:19:34+05:30 IST

మన వాతావరణంలో చాలా వరకూ కాలుష్యం పేరుకుపోయి ఉంది. శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం మొదలైనవి.

world nature day : ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించండి.. పర్యావరణాన్ని కాపాడండి.

ప్రపంచంలోని అన్ని జీవులలోకీ మానవులమైన మనమే ఈ గ్రహాన్ని వినాశనం వైపు తీసుకువెళుతున్నామనేది పర్యావరణ పరిరక్షకుల మాట.. సాంకేతిక పురోగతితో ఆధునీకరణతో వేగంగా ముందుకు వెళుతున్నాము. మన వాతావరణంలో చాలా వరకూ కాలుష్యం పేరుకుపోయి ఉంది. శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం మొదలైనవి. ఇటువంటి పరిస్థితిలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.


అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల నుండి, వృక్షాలు, జంతుజాలం అంతరించిపోవడం, గ్లోబల్ వార్మింగ్ వరకూ మన గ్రహం లెక్కలేనన్ని పర్యావరణ సమస్యలతో పోరాడుతుంది. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అనేది సహజ వనరులను పరిరక్షించుకోవడం కోసం అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. 


గ్లోబల్ వార్మింగ్ రకరకాల వ్యాధులు, ప్రకృతి వైపరిత్యాలు, పెరిగిన ఉష్ణోగ్రతలు పెరగడానికి సహజ వనరులను అతిగా దోచుకోవడమే కారణం. 


ఈ ఏడాది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించండి అనే థీమ్ తో జరుపుకుంటున్నారు. దీనికి మద్దతుగా దేశంలో వేగంగా పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్కాన్ని పరిష్కరించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లపై భారతదేశం కఠినమైన నిషేదాన్ని విధించింది. 


ఈ నిషేదం కిందకు వచ్చే ఉత్పుత్తులు..

స్ట్రాస్, కత్తులు, ఇయర్ బడ్ లు, ప్యాకేజింగ్ ఫిల్మ్, సిగరెట్ ప్యాకెట్లు ఇతర ఉత్పత్తులు ఉన్నాయి.


గత సంవత్సరం థీమ్..

గత సంవత్సరం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని అడవులు, జీవనోపాధి అనే థీమ్ తో జరుపుకున్నారు.


పర్యావరణ పరిరక్షణకు చర్యలు.. 

1. సౌర శక్తిని ఉపయోగించడం.

2. చెట్లును నాటడం.

3. తోటలకు నీళ్ళు పోయడానికి వంటగది నీటిని వినియోగించడం.

4. పరివాహక ప్రాంతాలలో వృక్షసంపదను పెంచడం.

5. వర్థాలను రీసైక్లింగ్ చేయడం.

6. కార్లను తక్కువ దూరాలకే వాడటం తగ్గించాలి.

7. సేంద్రీయ కంపోస్ట్ ఉపయోగించి కూరగాయలు పండించాలి.

8. నీటి శుద్ధి కర్మాగారాలను, వర్షపు నీటి నిల్వలను ఏర్పాటు చేయడం.

Updated Date - 2022-10-03T18:19:34+05:30 IST