సాగు ఖర్చులు తగ్గించుకోండి

ABN , First Publish Date - 2021-11-28T05:19:13+05:30 IST

సాగు ఖర్చులు తగ్గించుకోండి

సాగు ఖర్చులు తగ్గించుకోండి
కంది పంటను పరిశీలిస్తున్న డీఏవో గీతారెడ్డి, రైతులు, అధికారులు

ఇబ్రహీంపట్నం: పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతులు పాటిస్తే ఖర్చులు తగ్గి ఎక్కవ దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయాఽధికారి గీతారెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ్‌లో వ్యవసాయ సుస్థిరత మిషన్‌ కింద భూసార పరీక్ష, ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యాపీఠ్‌లో కంది పంటను పరిశీలించారు. రైతులతో ఆమె మాట్లాడుతూ యాసంగిలో వరి కాకుండా కూరగాయలు, నువ్వులు, మినుములు, పెసర, వేరుశనగ సాగుచేయాలని సూచించారు. ఏరువాక తాండూరు, మహబూబ్‌నగర్‌ శాస్త్రవేత్తలు యమున, అర్చన పంటల సాగు, విత్తన లభ్యత, సస్యరక్షణపై వివరించారు. ఏడీఏ సత్యనారాయణ, రైతు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, విద్యాపీఠ్‌ ప్రిన్సిపాల్‌ డి.శ్రీనివా్‌సరావు, అధికారులు వరప్రసాద్‌రెడ్డి, సందీ్‌పకుమార్‌, శ్రావణ్‌కుమార్‌, రఘు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:19:13+05:30 IST