Redmi Buds 4: మార్కెట్లోకి రెడ్‌మి బడ్స్ 4, బడ్స్ 4 ప్రొ.. ధర ఎంతంటే?

ABN , First Publish Date - 2022-10-07T01:29:13+05:30 IST

చైనీస్ మొబైల్ మేకర్ షావోమి (Xiaomi) తాజాగా సరికొత్త ‘రెడ్‌మీ బడ్స్ 4’(Redmi Buds 4), ‘రెడ్‌మీ బడ్స్ 4 ప్రొ’

Redmi Buds 4: మార్కెట్లోకి రెడ్‌మి బడ్స్ 4, బడ్స్ 4 ప్రొ.. ధర ఎంతంటే?

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షావోమి (Xiaomi) తాజాగా సరికొత్త ‘రెడ్‌మి బడ్స్ 4’(Redmi Buds 4), ‘రెడ్‌మి బడ్స్ 4 ప్రొ’(Redmi Buds 4 Pro)లను యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అతి తక్కువ ధర, పలు హైఎండ్ ఫీచర్లతో వచ్చిన ఈ బడ్స్ చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. డ్యూయల్ డ్రైవర్స్, హై-రెస్ ఆడియో, ఎల్‌డీఏసీ కోడెక్, 36 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు బడ్స్ 4 ప్రోలో ఉండగా, బడ్స్‌4లో 10 ఎంఎం డ్రైవర్స్, ఏఎన్‌సీ, 30 అవర్స్ ప్లేబ్యాక్ డ్యూరేషన్ వంటివి ఉన్నాయి. 


 రెడ్‌మి 4 బడ్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

10 ఎంఎం డ్రైవర్లు, ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్‌కు బయట టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇవి ఇలా చిన్నగా ఉండడంతో చెవిలో ఇమిడిపోతాయి. హైబ్రిడ్ ఏఎన్‌సీ కోసం అసిస్టెన్స్ కూడా ఉంది. చార్జింగ్ కేస్ లేకుండా ఆరు గంటలపాటు ఇయర్ బడ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అదే చార్జింగ్ కేస్‌తో అయితే 24 గంటలు ఉపయోగించుకోవచ్చు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఉన్నాయి. బడ్స్ 4 సిరీస్‌ ఐపీ54 రేటింగ్ కలిగి ఉంది. 


రెడ్‌మి బడ్స్ 4 ప్రొ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 

10 ఎంఎం+6ఎంఎం డ్యూయ్ ఆడియో డ్రైవర్లు, హై-రెస్ ఆడియోతోపాటు ఎల్‌డీఏసీ, ఏఏసీ, ఎస్‌బీసీ కోడెక్‌లకు మద్దతునిస్తాయి. 43 డెసిబుల్స్ వరకు నాయిస్‌ను అడ్డుకుంటాయి. అంతేకాకుండా యాక్టివ్ నాయిస్ కేన్సిలేషన్ (ANC) కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఇయర్‌బడ్‌లో ఏఎన్‌సీ, ప్లేబ్యాక్ నియంత్రణ, ఇతర ఫంక్షన్లను నియంత్రించేందుకు స్టెమ్ డిజైన్ ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే 9 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. చార్జింగ్ కేసుతో కలిపితే 36 గంటల బ్యాకప్ ఉంటుంది. 


రెడ్‌మి బడ్స్ 4, బడ్స్ ప్రొ ధరలు

రెడ్‌మి బడ్స్ 4 (Redmi Buds 4) ధర యూరప్‌లో 59.99 యూరోలు. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 4,900. లైట్ బ్లూ, గ్లోస్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పోలిస్తే ఇయర్ బడ్స్ 4 ప్రొ (Redmi Buds 4 pro) ధర చాలా ఎక్కువ. యూరప్‌లో వీటి ధర 99.99 యూరోలు. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 8,100. మిడ్‌నైట్ బ్లాక్, మూన్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 


Updated Date - 2022-10-07T01:29:13+05:30 IST