Abn logo
Aug 1 2020 @ 02:18AM

ఆకట్టుకునే డిస్‌ప్లేతో రెడ్‌మి 9!

మొబైల్‌ ప్రియులను ఆకట్టుకోవడం కోసం రెడ్‌మి మరో కొత్త మొబైల్‌ను విడుదల చేస్తోంది. రెడ్‌మి 9 పేరుతో విడుదలవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం కలిగి ఉంది. ఎల్‌సీడీ ప్యానెల్‌ ఉన్న 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్‌ 3 రక్షణ ఉంది. ఇక 5020 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. యూఎస్‌బి- సి పోర్టు సహాయంతో ఛార్జింగ్‌, డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. 13 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 8 వెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్‌ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్‌ డెప్త్‌ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Advertisement
Advertisement
Advertisement