కొత్త మోడల్‌లో Redmi 10 Prime స్మార్ట్‌ఫోన్

ABN , First Publish Date - 2021-09-04T23:12:09+05:30 IST

కొత్త మోడల్‌లో Redmi 10 Prime స్మార్ట్‌ఫోన్

కొత్త మోడల్‌లో Redmi 10 Prime స్మార్ట్‌ఫోన్

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ 7వ తేదీన భారత మార్కెట్‌లో రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయని సంస్థ తెలిపింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రూ. 12,499 ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రూ. 14,499కే లభించనుందని కంపెనీ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం కార్డు, ఈఎంఐ ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 750 తక్షణ డిస్కౌంట్ లభిస్తోందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-09-04T23:12:09+05:30 IST